మగవాడు
-
09:08:34 అపరాహ్నం on నవంబరు 21, 2008 | # |
“Your faults as a son is my failure as a father“, మార్కస్ అరీలియస్.
ఇంగ్లిష్ వాళ్ళకి ఎల్లో జర్నలిజం ఉంది. అపనిందలు, దూషణలు, వాస్తవాలని వక్రీకరించి రాయడం, అవాస్తవాలను, నమ్మశక్యం కాని విషయాలను ప్రజలు నమ్మేవిధంగా రాసి, ఆ విధంగా పాఠకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం, అలాంటి కధనాలను ప్రచురించడం ఎల్లో జర్నలిజం లో సహజం. డబ్బుకోసం ఒకొక్కప్పుడు, సర్కులేషన్ కోసం అలాంటి పద్దతులని ఈ ఎల్లో జర్నల్ స్ పాటిస్తూ ఉంటాయి. వారికి నలుగురి నోళ్ళలోను తమ పత్రిక పేరు నానుతుంటే, పదిమందిలో గుర్తింపు వస్తుంది కాబట్టి, తమ అమ్మకాలు పెరుగుతవి, ప్రకటనదారులు తమ పత్రికలో ప్రకటనలిస్తారు, ఆదాయం పెరుగుతుందని వారి భావన. కొండోకచో అది ఫలిస్తుంది కూడా!
♦ ♦ ♦
జగన్మోహన రెడ్డి పత్రిక నేమ్‌ప్లేట్ (nameplate) పసుపచ్చ రంగులో ఉంటుంది. దానిలో సాక్షి అక్షరాలు ముదురు నీలం రంగులొ ఉంటాయి. కొంచెం దూరం నుంచి చూసిన వారికి ఆ అక్షరాలు నల్ల రంగులో కనపడ్డంలో ఆశ్చర్యం ఉండదు. హిందూవులకి పసుపు మంగళప్రదం. నలుపు రంగు – విషాదాన్ని, దుఖాన్నీ సూచిస్తుంది.
♦ ♦ ♦
ఈనాడు పత్రిక సంపాదకుడు ఎవరు?
సాక్షి పత్రిక సంపాదకుడు ఎవరు?
ఆంధ్రజ్యోతి సంపాదకుడు ఎవరు?
♦ ♦ ♦
ఈనాడు పత్రిక అధినేత ఎవరు?
సాక్షి పత్రిక అధినేత ఎవరు?
ఆంధ్రజ్యోతి పత్రిక అధినేత ఎవరు?
మీ జవాబులతోనే మీకు తెలిసిపోయి ఉంటుంది, మీ బుర్రలోకి సంపాదకుడి పేరు ముందు వచ్చిందా, లేదు ఆ పత్రికాధినేత పేరు ముందు వచ్చిందా అని.
వ్యాపారాలు లాభాలకొరకే! కాబట్టి సంపాదకులతో కాని వారి విలువలను ప్రవచించే సంపాదకీయాలు గాని పాఠకులకు అఖ్ఖర్లేదు. తన పత్రికలో ఏది ఉండాలి, ఏది ఉండకూడదన్నది యాజమాన్యాలు నిర్ణయిస్తాయి. వార్తా ప్రసారరంగంలో సాంకేతిక విప్లవం పాఠకులకు కావలిసిన సమాచారాన్ని సెల్‌ఫోను ద్వారా, టెలివిజన్ ద్వార, జాలం ద్వారా ఇంకా అనేక రకాలుగా అందుబాటులో ఉంచుతున్నది. నేటి పాఠకులు తనకు కావల్సిన వార్తని తనకు అనువైన విధంగా తన సమయానుకూలంగా, తను కోరుకున్న పద్ధతిలో అందుకోగలుగుతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి కి ఆయన తండ్రి ప్రస్తుతం ఆంధ్రదేశ ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి నేర్పిన పాఠాలు, జగతి పబ్లికేషన్స్ – సాక్షి చూపిస్తున్నది.
లాభాపేక్ష.
ఈ పోటి ప్రపంచంలో గెలుపు ముఖ్యం – దానిని ఎలా సాధంచామన్నది ముఖ్యం కాదు. యుద్ధంలో “Do not hit under the belt” (పొట్ట కింద కొట్టరాదు.) అని అంటారు. కాని నేటి ప్రపంచంలో అది పనికి రాదు. వాడు నిన్ను కొడితే, నువ్వు కొట్టు. వీలైతే ఇంకా గట్టిగా కొట్టు. తొడగొట్టి, మీసం మెలేసి మరి, పొట్టకింద కొట్టి, వాడు మళ్ళీ లేవకుండా చావగొట్టు. శత్రుశేషం ఉంచకూడదు. అవతలి వాడు మొద్దువాడని ఉపేక్షించకూడదు. వాడిని కూడా హతమార్చాలి. లేకపోతే తన ఉనికికే భంగం ఏర్పడవచ్చు.
సాక్షి ప్రచురించకపోతే మరొక పక్షి ప్రచురిస్తుంది. అది అవతలి వాడికి లాభం చేకూర్చుతుంది. అదేదో మనమే ప్రచురించిద్దాం అని సాక్షి అనుకోవడంలో తప్పేమీ లేదు.
నేను ఈ టీవీ వాడిని. మా నాన్న కి విరోధులు ఆ టీ.వీ 9 వాళ్ళూ, వాళ్ళే నా ఇంటికి వస్తారు నా ఇంటర్వ్యూ కోసం. అలా నా పగ తీర్చుకుంటాను, అని ఆరు నెలల క్రిందటే సుమన్ రెడి అయ్యాడు. శ్రేయోభిలాషులు ఆపారు. నేడు టి వి 9 పోయింది. సాక్షి వచ్చింది.
తెలుగు మీడియాలో, సుమనంత గొప్ప మెగలోమనీయాక్ఉంటాడని అనుకోను. ప్రభాకర్ కంటే గొప్ప సైకోఫాంట్ ఉంటే ఉండవచ్చు గాక.
రామోజి రావు కి కష్టకాలం. తప్పదు. భరిస్తాడు. అన్ని అపజయాలు ఎదుర్కొన్నా, ఇన్ని గెలుపులు అతనే సాధించగలిగాడు. ఆ గెలుపులోనే సేద తీరుతాడు.
♦ ♦ ♦
ఐదు ఆస్కార్లు గెలుచుకున్న “గ్లాడియేటర్” సినిమాలో మార్కస్ అరీలియస్ తన కొడుకు కామడస్ తో అంటాడు: “Your faults as a son is my failure as a father.” తన తండ్రి తనకు పట్టం కట్టడు అని తెలుసుకున్నప్పడు మహారాజు మార్కస్ మీద ప్రేమని ఒలకబోస్తూ, నమ్మించి, ఆ ముదుసలిని తన చేతుల్లోకి తీసుకుని, మెడ పిసికి, గొంతు నులిమి, ఊపిరి ఆపేసి చంపేస్తాడు ఆ తనయుడు కామడస్.
♦ ♦ ♦
మార్కస్ మాటలు తండ్రులందరికి వర్తిస్తాయి.
* నేటి సాక్షిలో రామోజి రామాయణం చదివిన తరువాత
Loading imageClick anywhere to cancel
Image unavailable
Loading image
Click anywhere to cancel
Image unavailable
Loading image
Click anywhere to cancel
Image unavailable
Loading image
Click anywhere to cancel
Image unavailable
Loading image
Click anywhere to cancel
Image unavailable
Loading image
Click anywhere to cancel
Image unavailable
Loading image
Click anywhere to cancel
Image unavailable
Loading image
Click anywhere to cancel
Image unavailable



Madhu Janjur 10:50 అపరాహ్నం on నవంబరు 21, 2008 | # |
What ever you said correct, Butthe winner is only One. And everybody knows who is that person–
May God give full strength to Ramoji.
–Madhu
అష్టావక్ర 5:38 పూర్వాహ్నం on నవంబరు 22, 2008 | # |
బాగా రాశారండి!!
refreshing to read something which makes sense!
pappu 10:59 పూర్వాహ్నం on నవంబరు 22, 2008 | # |
నేను నిన్న సాయత్రం ఈన్యూస్ సాక్షిలో చదివాను. చాల చక్కగ ప్లాన్ చేసారు..దీన్నిబట్టి చూస్తే ప్రభాకర్ కి వారంటీ అయిపోయినట్లనిపిస్తోంది.ఈ దేవదూత రేషన్ కార్డ్ ని దేవుడి పుత్రులో వారి దూతలో చింపేసి అది ఆ పత్రికాధిపతిమీదకి తోసేసి ఆయన్ని ఎదో రకంగా “గ్లేడిఏటర్”లో లాగ??? అని అనుకున్నాను..
ఇవ్వాళా పొద్దున్నే న్యూస్ దేవదూత మీద దాడి అని…
lalita 12:42 అపరాహ్నం on నవంబరు 22, 2008 | # |
పప్పుగారు చెప్పింది నిజమయ్యే అవకాసం లేకపోలేదు
ట్విస్ట్ మీద ట్విస్టు
alwar swamy 12:59 అపరాహ్నం on నవంబరు 22, 2008 | # |
manasu-nanasakshi- viouvalu ;;these are the words now extinct.
To peep into others personal rooms and publicising them with our own mirchi masala
is the order of the day. May God bless them with little humanity.
కొత్తపాళీ 9:44 అపరాహ్నం on నవంబరు 22, 2008 | # |
Interesting comparison with Marcus Aurelius.
అందుకే తెలుగులో ఏదో సామెత ఉంది, పుణ్యం కొద్దీ పురుషుడూ దానం కొద్దీ బిడ్డలూ అని.
కానీ నాకొకటి విచిత్రంగా అనిపిస్తున్నది. ఎందుకు జనాలందరూ (మీతో సహా) రామోజీ మీద సానుభూతి కురిపించడం? అంటే, సటి మనిషికి ఇలాంటి తలవంపులయ్యే కష్టం వచ్చిందే అనే భావన ఐతే సరే. కానీ కార్పొరేటు కుటుంబాల్లో, రాజకీయ కుటుంబాల్లో ఇటువంటి వెన్నుపోట్లు సాధారణమే కాదా?
మగవాడు 11:44 పూర్వాహ్నం on నవంబరు 24, 2008 | # |
@ కొత్తపాళీ: మీ “తుపాకి” కధలో శంకర్ చేసిందేమిటి? ఒక తండ్రిగా కిరణ్‌కి ఏం చెప్పాడు?
రామోజీ రావు మీద సానుభూతి కనపడిందా మీకు ఈ టపాలో?
మార్కస్ తన తండ్రి పాత్రలో విఫలం అవ్వలేదా? రాజశేఖరెడ్డి, జగన్‌కి నేర్పిందదేగా?ప్రత్యర్ధిని ఎలా దెబ్బతియ్యాలనడమేగా.
కాని ఇక్కడ సుమన్ దుర్బలుడు. అహంకారి. అతను స్నేహితుడుగా ఎంచుకున్న వ్యక్తి – ఒక పరాన్నజీవి. కాబట్టే సుమన్ బయట పడ్డాడు. అందులోను “సాక్షి” ద్వారా. ఆ
“దూత” అనబడేవాడు టీ.వీ ౯లో. ఆ రెండూ, ఆ యా వ్యాపార రంగాలలో రామోజీ రావు సంస్థలకు ప్రత్యర్ధులు.
ఒకరికి ప్రత్యర్ధిని దెబ్బతీయడం మొదటి కర్తవ్యం ఐతే, రెండో వారికి, వారి రేటింగ్స్!
కార్పరేట్ వ్యవస్థ – బోర్డ్ రూమ్‌లో ని ఆటలకి దీనికి సంబంధం లేదు. వ్యవహారం కేవలం వ్యక్తిగతం, అంతర్గతం. కాబట్టి ఇక్కడ వెన్నుపోటు ప్రసక్తే లేదు.
ఎవరూ ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. మీరు మరి అలా ఎందుకనుకున్నారో.
@ Madhu: “When the going gets tough, the tough gets going.” It is also attributed to Joseph P Kennedy, f/o John F Kennedy the late president of US of A: Here Ramoji is going through some of the toughest hours in the winter of his life. He needs all the support he deserves.
@ అష్త్రావక్ర: నెనరులు.
@ పప్పు: ఆ వ్యక్తి (మీరంటున్న దేవదూత) మన కాలాన్ని వృధా చేస్తున్నాడు.అతన్ని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
@ సుజాత: అంత దూరం వెళ్ళదులేండి.
@ alwar swamy: Dont you think it is ironic? మారదర్శి ని ప్రసారంచేసే తండ్రి – తన తనయుడికి మార్గదర్శి కాలేకపోవడం!
పొద్దు » Blog Archive » నవంబరు బ్లాగుల ప్రస్థానం 8:54 పూర్వాహ్నం on డిసెంబరు 1, 2008 | # |
[...] జసుగమన్ రామాయణం అంటూ మగవాడు రాసారు. [...]