ఇటీవలి తాజాకరణలు Toggle Comment Threads | కీబోర్డ్ చిట్కాలు

 • మగవాడు 3:34 pm on March 30, 2009 శాశ్వత లింకు | స్పందించండి  

  భాగ్యం తృప్తి 

  *అరుణమ్ లో “మనబొమ్మలేమవుతాయో” చదివినతరువాత..

  శుక్రవారం చాల మంది తెలుగు ఆడపడుచులు లాగానే నా భార్య కూడా తలంటుకుంటుంది. బయటున్నా సరే. దేవుడు, దెయ్యం, మడి నమ్మకాలు లేక కాదు. శుభ్రం గా ఉండాలని. అలాంటి ఒకానొక శుక్రవారం నేను ఇంట్లో నే ఉండటం తటస్థించింది. తడిసిన జుట్టుని ఆరబెట్టుకుంటూ, దువ్వెన తో దువ్వుకుంటూ, ముడిపడిన కేశాలను సరిజేసుకుంటూ, ఊడిపోయిన జుత్తుని తన వేళ్ళకు చుట్టు కుంటున్నది. అలా చుట్టుకుంటూ, స్నానాల గదిలోకి వెళ్తున్నది. మళ్ళీ బయటకు వచ్చేటప్పడికి చేతిలో ఆ ఊడిపోయిన వెంట్రుకలు కనపడటంలేదు. అలాగని స్నానాల గదిలో వాటిని పడెయ్యడానికి అక్కడ బుట్ట లాంటిది ఏమి లేదు. ఇక కుతూహలం ఆపుకోలేక,” భాగ్యం, ఏం చేస్తున్నావు, ఆ ఊడిపోయిన వెంట్రుకలతో?” అని అడిగాను.

  (More …)

  ప్రకటనలు
   
 • మగవాడు 6:15 pm on March 23, 2009 శాశ్వత లింకు | స్పందించండి
  Tags: స్త్రీ, Woman, women   

  యూ ఉమన్ 

  “యూ ఉమన్, యూ అండ్ యువర్ బ్లడీ పీరియడ్స్!అహ్!”

  “You woman, you and your bloody periods!ugh!!”

   
 • మగవాడు 2:46 pm on March 19, 2009 శాశ్వత లింకు | స్పందించండి
  Tags: అలోచన, ౨౦౦౯   

  యవ్వనాన్ని స్ఖలించాను 

  నా కొక జ్ఞాపకాన్ని పాడవా

  అంటూ ఆ కళ్ళలోని నిశబ్దం నన్ను అడిగింది.

  చీకటిని పరుస్తున్న వెన్నెల

  చిగురాకుల రెపరెపల మధ్య కిసుక్కున నవ్వింది.

  లాగిన నరాలను మీటిన వలపుల తలపుల

  హొరు ఒక తుఫానుని రేపింది.

  ఆ నరాల అలజడి

  ఒక ప్రేమని స్ఖలించింది

   
  • Srinivas 10:10 సా. on మార్చి 19, 2009 శాశ్వత లింకు | స్పందించండి

   చాలా బాగుంది. ముఖ్యంగా మీ పదాల ఎంపిక, కూర్పు.

  • రమేశ్ 10:27 సా. on మార్చి 19, 2009 శాశ్వత లింకు | స్పందించండి

   కళ్ళలోని నిశబ్దమా ???
   అయితే గొంతులో చూపు సంగతో???

   చీకటిని పరుస్తున్న వెన్నెలా???
   కారం పరుస్తున్న తేనె …..

   ప్రేమ స్ఖలించటం ఏంటి బాబూ?
   నా తలకాయ …… స్ఖలనాలు వేరే జాతి………

  • Dilip 12:41 ఉద. on మార్చి 20, 2009 శాశ్వత లింకు | స్పందించండి

   Yevari pichi vaariki aanandam.

   • మగవాడు 7:30 సా. on మార్చి 20, 2009 శాశ్వత లింకు | స్పందించండి

    బాయ్స్ సినిమాలో అనుకుంటా, మీ అమ్మాయిలు మూడ్ వస్తే ఏం చేస్తారని అడిగితే, కాళ్ళు మెలేసుకుని ఒత్తుకుంటాం అని జవాబిస్తుంది.
    మరొక సినిమాలో హీరోయిన్ ” ఐ వాంట్ టు మేక్ లవ్ అనో ఐ వాంటు హవ్ యువర్ చిల్డ్రన్” అనో అంటుంది.
    నిజమే! ఆ వయసులో ఆ పిచ్చి. మీ వయసులో మీదొక పిచ్చి. నా వయసులో నా దొక పిచ్చి. అవును ఇది అస్సలు పిచ్చనే అంటారా?
    ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలని పెద్ద వాళ్ళు ఊరికినే అనలేదు.

  • rayraj 11:57 ఉద. on మార్చి 21, 2009 శాశ్వత లింకు | స్పందించండి

   మిగితా అంతా అందుకున్నట్టే ఉన్నాను
   “ప్రేమని స్ఖలించింది” – స్ఖలించడమేమిటి ఆయన బొంద! అది “ప్రే……….మ” అనుకుంటూ నిన్న వెళ్ళిన మాట నిజం. ఇవ్వాళర్దమయ్యింది – గాన్ విత్ ది విణ్డ్ ఇన్వైన్.

   ఐ థింక్ ఐ గాట్ ఇట్! దట్ వజ్ బ్రిలియంట్!

  • rayraj 4:21 సా. on మార్చి 21, 2009 శాశ్వత లింకు | స్పందించండి

   As a second thought, i think the mental association of the word is too strong to be used in this manner.

   Although poetry, in a way is an interplay of words – their mental association used for expressing a different context, i think – the first lines are good but the last one may be avoided,perhaps.

   long ago so long ago when i did not know abt telugu blogs, there was some one who has written a brilliant blog in english – explaining how framing different equations and transforming the word matrices, you can create a beautiful poetry ; yet how it is not real poetry.it was good satire; I have no clue on how to get the blog now.

 • మగవాడు 12:32 am on March 3, 2009 శాశ్వత లింకు | స్పందించండి
  Tags: పెళ్ళి, ప్రేమ, బావ, మరదలు   

  ” నిన్నేలా మరిచి పోతాను బావా?” 

  సాయంత్రం రాగానే ఫ్రిడ్జ్ మీద ఉంది ఆ కవరు.  తెలుస్తునే ఉంది, వెడ్డింగ్ ఇన్వైట్ అని.  ఎవరిదబ్బా,  పోస్ట్ లో పంపారు.  నా పోస్టల్  అడ్రెస్స్ ఎవరిదగ్గిరుందా అని అనుకుంటూ ఎడమ చేత్తో అందుకున్నాను.  ఫ్రం నాగ రాజు అది. నిట్టుర్పూ.  ఎప్పటి నాగ రాజు. ఎక్కడి నాగ రాజు.  నాగ రాజు కి నా అడ్రస్సు ఎక్కడిది. నా పుర్తి పేరు నాగరాజుకి తెలిసే అవకాశం లేదు.  ఐనా   నా అడ్రస్సు తెలిసుంటే, అవకాశం దొరికితే నన్ను అడ్డం గా నరికెయ్యడూ?    దస్తూరి ఎవరిదో అని చూసాను.  “పెద్దా” దా?  ఏమో? పెద్దాదో అతని సోదరుడిదో?  చాలా రోజులయ్యింది వాళ్ళ దస్తూరి చూసి.  పెద్దాదే అయిఉండవచ్చు.  అతనే నా పోస్టల్ అడ్రస్సు అడిగి మరీ తీసుకుంది.  గుర్తున్నానన్నమాట. నన్ను కలుద్దామని ఉండి ఉంటుంది.  తనకి తెలుసు వాళ్ళ నాన్న అంటే నాకు చాల ఇష్టం అని, మా అమ్మకి కూడ తన అన్నయ్య అంటే ప్రేమ అని. అఫ్‌కోర్స్ తన చెల్లెలు నేను ప్రేమించుకున్నామని కూడా తెలుసు.  ఇన్‌ఫాక్ట్ తను కూడా ఇష్టపడ్డాడు నేను తన చెల్లెల్ని చేసుకుంటే ఆమె జీవితం బాగుంటుందని, ప్రేమిస్తున్నవాడు తనని సుఖపెడతాడని.  మనం ప్రేమించే వాళ్ళని కోల్పోయినా ఫరవాలేదు కాని మనల్ని ప్రేమించే వాళ్ళని కోల్పోకూడదని తన చెల్లెలికి విడమరిచి మరీ చెప్పాడు.   (More …)

   
  • bhshravankumar 10:10 ఉద. on మార్చి 3, 2009 శాశ్వత లింకు | స్పందించండి

   ఇలాంటి సందర్భాలలో ఆ పరిస్తితిలో ఉన్నవాడికే ఆ బాధ తెలుస్తుంది..

  • rayraj 7:51 సా. on మార్చి 3, 2009 శాశ్వత లింకు | స్పందించండి

   సార్!మరోలా అనుకోకండి! ఇన్నేళ్ళు గడిచాక ఇంకా అలాగే ఫీలింగ్ ఉంటుందా!

   ఇక్కడ కొన్ని కోణాలు రాయబడి లేవు.నేను వ్యక్తిగత విషయాలను అడగట్లేదు.

   అదేదో సినిమాలో – తనికెళ్ళ భరణి – కొడుకుకి తన చిన్నప్పటి ప్రేమ విషయం చెప్పి – ’అలా మిస్ అయిపోయరా! నువ్వు నాలాగా కాకూడదు; ట్రై న్ ట్రై అగైన్ ’ అని వివరాలు తెలీన సుబ్బలక్ష్మి ని వెతుక్కొమంటూ హీరో ని అమెరికా పంపిస్తాడు.మిగితా సినిమా ఓకే గానీ, ఆ సీను నేను అంతగా జీర్ణించుకోలేదు.

   “నువ్వు నాకు నచ్చావ్” లో కూడా సుహాసిని పాత్ర హీరోయిన్ ని అలాగే ప్రోత్సహిస్తుంది.

   ఆ రెండూ పాత్రల్లోనూ – ఏదో కోల్పోయమన్న భావన చూపించినప్పుడు – పక్కన ఇన్నేళ్ళూ సేవ చేసుకున్న జీవిత భాగస్వామి ఏమనుకోవాలి!?ఫూలిష్ గా జీవితం గడిపినట్టా!? ఎజ్యుమింగ్ జీవితభాగస్వామికి వేరే ప్రేమాయణం లేకపోతే,ఇన్నేళ్ళు ప్రేమిస్తూ అడుగడుగునా పక్కన నిలబడ్డా కూడా – ఇంకా ఎప్పుడో చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి మీద “ప్రేమ” ఎందుకుంటుంది!?

   ముఫ్ఫై యేళ్ళో / పాతికేళ్ళో గడిపిన ఈ ప్రస్తుత జీవిత భాగస్వామి ప్రేమ లో ఆ చిన్నప్పటి ప్రేమ చిన్నదైపోదా!

   మురిపెంగా ముచ్చటించుకోవచ్చేమో గానీ,
   ఇంకాబెంగ పడితే ఆమె/అతను జీవితాలు ఏమి కావాలి? వాళ్ళమీద ఈ తనికెళ్ళ / సుహాసిని పాత్రలకి కనీసం జాలి కూడ లేదా!?

   కభీ అల్వది నా కెహనా అనే చిత్రంలో కూడా ( సినిమాలో చాలా లోటు పాట్లు ఉన్నా) – ఇలాంటి యాంగిల్ ఇంకో రకంగా ఉంటుంది.ఇందులో వయసు ఇంకా యవ్వనమే అనుకోండి – షారుక్ ఖాన్ కోసం / కుటుంబం కోసం భార్య ప్రీతి జింటా కష్టపడుతుంది.వేరే ప్రేమలేదు – రాణీ ముఖర్జీ భర్త అభిషేక్ బచ్చన్ కూడా భార్య మీద అమిత ప్రేమ కలవాడే! కానీ, షారుక్-రాణీ ఒకరికొకరు దగ్గరౌతారు. మై పాయింట్ ఈజ్ – ఇంకా చిన్న వయసే కాబట్టి – ఒకరి తోడు ఒకరికి నచ్చింది;ప్రేమ పుట్టింది అనుకోవచ్చు.

   కానీ వయసు మళ్ళేసరికి – భార్యాభర్తలు మంచి స్నేహితులవ్వాలి కదా! ఇంకా ఆ తోడు ఎక్కడో ఎందుకు వెదకాలని ఉంటుంది?

   కేవలం ఒక ప్రేమ / పెళ్ళి / మనసు / ఫైయిళ్డ్ మ్యారేజస్ గా ఏమన్నా చెబ్తారేమో నని ఇంతరాశాను.ఇష్టంలేక పోతే ఈ వ్యాఖ్యని తొలగించండి.

   • Sree 12:52 సా. on మార్చి 6, 2009 శాశ్వత లింకు | స్పందించండి

    rayraj గారికి – మీ అభిప్రాయంతో విభేదించడమో, వాదనకు ప్రేరేపించడమో నా ఉద్దేశ్యం కాదని ముందుగా తెలుసుకోండి.

    చిన్నప్పటి ప్రేమ చిన్నదైపోతుందేమోనన్నారు. కాలేజీ ప్రేమలు, కంప్యూటర్ సెంటర్ ప్రేమలైతే మర్చిపోయేందుకు ఆస్కారముండవచ్చు. వాళ్లు పెళ్లి చేస్కుని ఎటో వెళ్లిపోతారు, మనం మరెక్కడో సెటిలైపోతాం. కానీ బంధువుల్లో అమ్మాయి, మరదలు వరస అయ్యే అమ్మాయిని ప్రేమించి, పెద్దలు కూడా ప్రోత్సహించిన ప్రేమల సంగతి మరోలా ఉంటుంది.

    కుటుంబ కార్యాల్లో, ఫంక్షన్లలో కనీసం సంవత్సరానికి ఓసారైన కనిపిస్తూ, మర్చిపోయేందుకు (?) ప్రయత్నించే అనుభూతులను పదే పదే గుర్తు చేస్తే….. ఎలా..

    ఐతే, పెళ్లయిపోయిన స్త్రీ గురించి ఆలోచించడం తప్పయినప్పటికీ అది చెడుగా కానంతవరకు, ఆమెను ఎలాగైనా తిరిగి స్వంతం చేసుకోవాలని ఆలోచించనంత వరకు ఫర్వాలేదు అని నా వ్యక్తిగత అభిప్రాయం.

    చివరిగా, ఈ పోస్ట్‌ను ప్రెజెంట్ చేసిన శైలి బాగుంది..

   • మగవాడు 3:01 సా. on మార్చి 19, 2009 శాశ్వత లింకు | స్పందించండి

    @rayraj: ఉంటుంది. వారివుది మధ్య ఆ బంధం ఉన్నప్పుడు “ఆ ఫీలింగ్” తప్పక ఉంటుంది. మరి వారు చేస్తున్నది తప్పు కాదా? కాదు. ఇది సినిమా కాదు. జీవితం. ప్రేమించిన వారిని వివాహమాడలేక మరొకరితో జీవితాన్ని సుఖంగా గడుపుతున్నవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వారి తమ జీవిత భాగస్వామికి గాని తమ పిల్లలకి గాని ఎటువంటి అన్యాయం చెయ్యడం లేదు. మీరన్నది నిజమే. భార్య భర్తలు మంచి స్నేహితులవ్వాలి. ఆరోగ్యకరమైన మానసిక బంధాలున్నప్పుడు వారివురి మధ్య ఎటువంటి అపోహలు ఏర్పడవు. ఇక్కడ “ఆమె” తోడు వెతుక్కోవడం లేదు. కోరుకున్న “ఆ తోడు” ఒక జీవిత కాలం సహచర్యం కోల్పోడం లోని బాధ అనుభవిస్తున్న వారికి తెలుస్తుంది. వయస్సుకి జ్ఞానానికి, పరిణితికి సంబంధం లేదు. కాని కొన్ని అనుభంతోను, కొన్ని వయస్సుతోను కొందరిలో త్వరగాను, మరి కొందరిలో ఆలస్యంగాను జీవితం పాఠాలు నేర్పుతుంది.

  • sree 7:51 సా. on మార్చి 9, 2009 శాశ్వత లింకు | స్పందించండి

   i dont know y u haven’t yet accepted my comment…

  • rayraj 9:19 సా. on మార్చి 19, 2009 శాశ్వత లింకు | స్పందించండి

   ఛ-ఇలాంటి విషయాల్లో వాదనేంటండి!ఇది మనసులకు సంబంధించింది.ఆ మనసుని అర్ధం చేసుకోడానికే అడేగాను.

   కోరుకున్న “తోడు”ని మిస్ అవ్వటంలోని బాధనే అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. దానిపైన,సహచార్యం ఇచ్చినవారి మనసు గురించి ఆలోచిస్తున్నాను.

   అన్యాయం చేయడం కాదండీ!అన్యాయం జరగటం-అంతే!

   నేను ఓ మనసు తోడు కోరుతున్నాను.ఆ మనసు వేరే తోడు మిస్ ఔతోంది.అంటే నేను కోరుకున్న మనసుని నేనూ మిస్ ఔతున్నాను!నా బాధ అది!

   ఒకవేళ నేను నా ప్రేమలో-ఓ జీవితకాలం ఆ తోడుని భర్తీ చేసే ప్రయత్నంలో ఉంటే,
   నా వృధాప్రయాసకి నేనెంత బాధ పడతానో అని ఆలోచిస్తున్నాను!లేక నా ప్రయత్నం సఫలమై ఆ మనసుని నే గెల్చుకుంటే-మహదానందం!

   లేకపోతే – మళ్టిపుల్ లవ్స్ ని యాక్సప్ట్ చేయాలి!అంటే ఈ మనసు ఎన్ని మనసులనైనా ప్రేమించడం!నిజానికి అది సాధ్యమేనని నా కనిపిస్తుంది.కానీ అప్పుడు నాకు వేరే కొన్ని ధర్మ సందేహాలొస్తాయన్నమాట!అదీ విషయం.

   మనసు “ఇలాగే ఉండాలి” అంటే అది ఎలా ఉంటుందండి!? కోతిగీతల వాణ్ణి -అది నాకు తెలియదా!

  • mahesh 7:01 ఉద. on జూన్ 13, 2010 శాశ్వత లింకు | స్పందించండి

   sir is this real

  • raj 8:18 సా. on మార్చి 8, 2012 శాశ్వత లింకు | స్పందించండి

   bagane vundi

 • మగవాడు 10:28 am on February 25, 2009 శాశ్వత లింకు | స్పందించండి
  Tags: అర్ధిక మాంద్యం, , జీతం, నిరుద్యోగం   

  ఏం చెయ్యాలి? 

  అప్పటికే డవున్ సైజింగ్ ఐపోయ్యింది.  టాప్ హేవి గా ఉన్నదని, నన్ను సెలవు పుచ్చుకోమన్నారు.  వాళ్ళు ఆ మాట అన్న తరువాత చెయ్యగలిగినది ఏమున్నది, తప్పుకోక.  సమయం లేదు.  వయస్సు తక్కువ కాదు.  అనుభవమూ తక్కువ కాదు. కాని నాకు తగిన ఉద్యోగం దొరకాలి కదా!  దొరికినా, వాళ్ళు ఇవ్వాలి కదా?

  (More …)

   
 • మగవాడు 6:41 pm on December 10, 2008 శాశ్వత లింకు | స్పందించండి
  Tags: జయ ప్రకా‌ష్ నారాయణ్, లోక్‌సత్తా   

  మరో ఇద్దరు కలిసారు 

  వారే శ్రీనివాస్ పప్పు, అష్టవక్ర.

  నేపధ్యం:  ముంబై ఘాతుకాల నేపధ్యంలో నా మొదటి టపా.

  ప్రస్థుత వ్యవస్థ, రాజకీయ ప్రక్షాళనం చెయ్యాలన్న సూచన.  వస్తున్న ఎన్నికల ఫలితాలను కొంతైనా ప్రభావితం / మార్చడానికి చెయ్యగలిగిన ఒక కార్యాచరణ ప్రణాళిక కొరకు ఒక పిలుపు.

  ఈ నేపధ్యంలో, చీకటిని తిట్టుకుంటూ కూర్చోకుండా, కార్యోన్ముఖలవ్వడానికి కొంత ప్రేరణ కలిగించే టపాలు ఇందాక చెప్పుకున్నట్టుగా,  రెండు వెలువడ్డవి.

  చదువరి గారు తమ పద్ధతిలో చెప్పదలుచుకున్నది చెబుతున్నారు.  వారు లోక్‌సత్తా పార్టీ కి తమ మద్దతు తెలుపుతున్నారు.  సహాయాన్ని అహ్వానిస్తున్నారు కూడా!

  కాని వారి టపాలో వాఖ్యలు చదివినా, వాడిని, వీడిని తిట్టడమే కనబడుతుంది కాని ఆచరణయోగ్యమైన పధకాలు కనపడడం లేదు. మరి ఉంటే నేను గమనించలేదో!

  అక్కడే డా.ఇస్మాయిల్ గారు ఒక సూచన చేసారు. చదవండి.  మీ స్పందనని అక్కడే  తెలియజేయండి.

  Chief Election Commissioner గోపాలస్వామి గారు ౨౦౦౯ ఏప్రిల్, మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నవని అన్నారు.  కాబట్టి కొంత సమయం ఉంది.  ఐనా మనం చెయ్యవలసింది చాలానే ఉంది.

  మీ ఆలోచనలేవైనా ఉంటే ఇక్కడ మీ వ్యాఖ్యలలో వెలిబుచ్చండి.  లేదు మీ బ్లాగులోనే టపాయించండి.

  నాకు తెలియజేస్తే ఇక్కడ ఒక లంకె వేస్తాను.  లేదు, మీ టపాలో దీనికి ఒక లంకె ఇచ్చినా సరే!

  ఈలాంటి టపాలు మీకు తెలిసినవి ఉన్నా, మీరే రాసినా దయచేసి నాకు తెలియజేయండి. సాధ్యమైనంత వరకు వాటికి ఇక్కడ లంకెలివ్వడానికి ప్రయత్నిస్తాను.

   
  • sneha 7:35 సా. on డిసెంబర్ 11, 2008 శాశ్వత లింకు | స్పందించండి

   ఎవరైనా ఆచరణయోగ్యమైన పథకాలు చెప్తారని చుస్తున్నా ఎవరూ ముందుకు రాలేదేంటి?

  • యోగి-the outcast 12:32 ఉద. on డిసెంబర్ 12, 2008 శాశ్వత లింకు | స్పందించండి

   నా బ్లాగునిక్కడ ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు.

   దేశంలో రెండు రకాల రాజకీయాలున్నాయి. ఒకటి లోక్సత్తా చేస్తున్న రాజకీయం ఇంకోటి మిగతా పార్టీ శునకాలన్నీ చేస్తున్న రాజకీయం. ఏరోజైనా నిస్సందేహంగా నేను లోక్సత్తా కే ఓటు వేస్తాను.

   కానీ ఓటు కూడా ఈ వ్యవస్థలోనే భాగం. రాజకీయ నాయకులెవరూ జన్మతః కర్కోటకులు కారు. వ్యవస్థ ఫలాలే వాళ్ళు. చిన్నా చితకా మార్పులు చాలా వచ్చాయండి ఇలాంటివి, కానీ వాటివల్ల ఏమీ జరగదు.

   It is a handful of thinking brains and with resolve written on their forehead, the brightest brains of India must sincerely work on debunking social sciences and propose alternatives to the existing theories.

   I such an effort going on at the moment, and I wish to be a part of it. I encourage you, anyways 🙂

   Cheers
   Yogi/Ashtavakra

  • కొత్తపాళీ 4:54 ఉద. on జనవరి 4, 2009 శాశ్వత లింకు | స్పందించండి

   Very interesting.
   Could you please send me a mail?
   kottapali at gmail dot com
   thank you

  • ramesh kumar 11:37 ఉద. on ఫిబ్రవరి 19, 2009 శాశ్వత లింకు | స్పందించండి

   Sneha garu meeru oka saari loksatta manifesto chudandai, That is available in loksatta.org

  • bonagiri 4:34 సా. on ఫిబ్రవరి 25, 2009 శాశ్వత లింకు | స్పందించండి

   నా బ్లాగులో ఒంటరి సత్తా వ్యాసం చూడగలరు.

  • bhshravankumar 11:07 సా. on ఫిబ్రవరి 25, 2009 శాశ్వత లింకు | స్పందించండి

   థంబ్ రూల్..రెండంచెల పోలీసు వ్యవస్త..మంచి సమాచార వ్యవస్త..నా ఆలోచనలు..look in my blog http://prakamyam.blogspot.com/

 • మగవాడు 9:36 pm on November 30, 2008 శాశ్వత లింకు | స్పందించండి
  Tags: అభ్యర్ధులు, , ఉగ్రవాదులు, ఎన్నికలు, ఒబెరాయ్, తాజ్, నెటిజన్, పేలుళ్ళు, బాంబు, బాంబులు, బాంబె, బొంబాయి, ముంబై, రాజకీయాలు   

  మీరు కూడా ఒక ఎన్.ఎస్.జి కమాండొ కండి. 

  యుద్ధంలో ఉన్న మన సైనికుల కోసం వారం లో ఒక పూట స్వచ్చందంగా ఆహరాన్ని తీసుకోవడం మానేసే వారం.  అంటే పస్తు ఉండేవాళ్ళం.  ఆ రోజున మా వంతు భోజనం మానేసి  వారికి పెట్టినంత సంబరం పడే వాళ్ళం.  తలచుకుంటుంటే ఇప్పుడు కూడా ఎంత సంతోషంగా ఉందో.

  అది ఒక నలు చదరపు పాక.  నాలుగు మూలలు.  నాలుగు స్థంభాలు.  దాని మీద వెదురు బొంగులతో కప్పు.  కొబ్బరి ఆకులతో కప్పేసి ఉండేది.  నాలుగు స్థంభాల మధ్య గచ్చు.  చుట్టూ ఉన్న ప్రదేశానికంటే బహుశ ఒక అడుగు ఎత్తులో ఉండేదేమో ఆ గచ్చు.  పాక చుట్టు మొక్కలు. కొన్ని కుండీలలో ఉండేవి. వాటిలో కొన్ని పూల మొక్కలు.  మొక్కలే ప్రహరి.  ఆ మొక్కల మధ్యలో ఒక చోట కొంత ఖాళీ ఉందేది.  ఆ ఖాళీ మధ్యనుండి మా క్లాసులోకి దారి.  రెండు అడుగులు వేస్తే, అక్కడ ఒక చిన్న మెట్టు.  ఆ మెట్టు ఎక్కితే మా క్లాసులోకి ప్రవేశం.

  (More …)

   
  • laxmi 9:57 ఉద. on డిసెంబర్ 1, 2008 శాశ్వత లింకు | స్పందించండి

   బాగుందండీ మీ టపా. అందరమూ మంచి నాయకుడు కావాలి అనే అనుకుంటున్నాము, కాని ఆ సత్త ఉన్న వాడిని ఒక్కడిని చూపించండి. ఇటీవలే నేను దీని మీద ఒక టపా రాసాను, నా బ్లాగ్లో చూడండి.

   • మగవాడు 8:54 సా. on డిసెంబర్ 7, 2008 శాశ్వత లింకు | స్పందించండి

    @ లక్ష్మి: కూరలు కొనుక్కోవడానికి వెడుతున్నారు. ఏరుకోవటంలేదు? ఇది అంతే! చీకటి అని భయపడుతు కూర్చుంటే వెలుతురు ఎక్కడినుంచి వస్తుంది. మనమే ఆ చీకటినుంచి వెలుగులోకి రావాలి. ఒక నాయకుడిలో మీకు ఏం కావాలో చెప్పండి. వెదుకుదాం.

  • బాబు 1:17 సా. on డిసెంబర్ 1, 2008 శాశ్వత లింకు | స్పందించండి

   మీరు చెప్పినవన్నీ చేస్తా.. నాకు ఎంత ఇస్తారు..?

   • మగవాడు 9:00 సా. on డిసెంబర్ 7, 2008 శాశ్వత లింకు | స్పందించండి

    @బాబు: ఇదే! ఈ పరిహాసమే, ఈ వెటకారమే వాడికి బలాన్ని ఇస్తోంది. ఈ నిర్లక్షమే మన ప్రాణాలు హరిస్తొంది. ఈ నిరాసక్తతే మనం ఎన్నుకున్న నాయకుడికిి, కూర్చోబెట్టిన అధికారికి మన పట్ల ఒక దురభిప్రాయాన్ని కలుగజేస్తున్నది. బాబు, ఇదే అదను బాబు వాడిని దెబ్బ తీయడానికి. దయచేసి మొదలు పెట్టండి. మీకు కాకపోతే రేపు మీ పిల్లలకైనా ఒక మంచి ప్రపంచాన్ని అందించగలుగుతారు.

  • snehamolakatalla 7:43 సా. on డిసెంబర్ 1, 2008 శాశ్వత లింకు | స్పందించండి

   మీ టపా చదివానండి.మీరు చెప్పినది బాగుంది. మీ టపా లో వచ్చిన ఒక వ్యాఖ్య ఇప్పుడే చూస్తున్నాను.ఓటు మీ ఆయుధం అంటే ఎవరికి వేయాలో చూపించండి అని. ఇదేలా వుందంటే ఆకలి వేస్తుంది అంటే సరుకులు అన్ని ఇచ్చి మీక్కావలసినట్లు వండుకు తినండి అని చెప్తే మీరు ఇచ్చిన వంకాయలు పుచ్చువి ఎలా వండాలండి అన్నట్లు వుంది. అందుకే నేను నా టపా లో మీరు ఇలా చేయండి అని చెప్పలేదు.

  • snehamolakatalla 5:36 సా. on డిసెంబర్ 7, 2008 శాశ్వత లింకు | స్పందించండి

   మగవాడు గారు,చదువరి గారి బ్లాగులో మీరు సరిగ్గ అర్థం చేసుకోలేదో, నేను సరిగ్గా రాయలేదో మరి. నేను ఓటు వేయడంతో పాటు ఇంక మన బాధ్యతలు ఏమి అని తెలుసుకుందామని అని అడిగానండి. అంతే గాని ఏమి చేయకుండా వుందామని అనలేదు. మీకు వీలైతే చెప్పండి. మిగతా వాళ్ళ గురించి నాకనవసరం కనీసం నా బాధ్యత ఎమిటో తెలుసుకుందామని అడిగాను.
   అక్కడ రాయడానికి ఎదో ప్రాబ్లం వస్తుంటే ఇక్కడ రాస్తున్నానండి

  • కె.మహేష్ కుమార్ 10:01 సా. on డిసెంబర్ 7, 2008 శాశ్వత లింకు | స్పందించండి

   ఆంధ్రదేశం మొత్తం కలిసికట్టుగా జయప్రకాశ్ నారాయణ్ (లోక్ సత్తా)ను ఎన్నుకోగలదా? క్యాండిల్ వెలిగించినంత సులభంకాదు వ్యవస్థను మార్చడం. అలా చెయ్యడానికి మనకు కావలసింది ఆవేశం కాదు. మార్పుకోసం కార్యశీలత, నిబద్ధత, నిర్ధిష్ట ప్రణాళిక ఏర్పరుచుకుని సాధించగల సత్తా కావాలి. అలా తయారవుదామా!

   • మగవాడు 11:07 సా. on డిసెంబర్ 7, 2008 శాశ్వత లింకు | స్పందించండి

    @కె.మహేష్ కుమార్: ఎన్నుకోలేదు. అలాగని చేతులు ముడుచుకుని కూర్చొలేము కదా! అందుకే ఒక నిర్దిష్ట ప్రణాలిక ని చదువరి గారి టపాలో వ్యాఖ్య గా ఉంచాను, నా టపాలో రాయడం కాకుండా. ఆ వైపుగా కొంత మంది బ్లాగ్ మిత్రులు బయలుదేరారు కూడా. ఉదా: ఇక్కడ శ్రీనివాస్ పప్పుగారి టపా చూడండి.

  • snehamolakatalla 12:54 ఉద. on డిసెంబర్ 8, 2008 శాశ్వత లింకు | స్పందించండి

   మహేష్ గారు, అందరికి తెలుసండి క్యాండిల్ వెలింగినంత సులభం కాదు వ్యవస్థ ను మార్చడం అని. రాత్రి కి రాత్రి వ్యవస్థ లో మార్పు రాకపోవచ్చు కాని ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు మొదటి అడుగు వేయాలి కదండి. ఆ అడుగు ఇప్పుడే వేద్దాం కష్టమో నష్టమో మన పని మనం చేద్దాం. అంతే గాని ప్రయత్నం అంటూ చేయకుండా ఎన్నాళ్ళు విశ్లేసించుకుంటూ , తప్పులు ఎత్తి చూపుతూ వుంటాం.

  • కె.మహేష్ కుమార్ 7:40 ఉద. on డిసెంబర్ 8, 2008 శాశ్వత లింకు | స్పందించండి

   @మగవాడు &స్నేహ: మీ వంతుగా కృషి చేస్తున్నందుకు అభినందనలు. ఈ కార్యశీలతే నేను సూచించింది, ఆశించింది. మార్పుకోసం బయల్దేరిన బ్లాగ్మిత్రులందరికీ నా అభినందనలు.

 • మగవాడు 4:06 pm on November 26, 2008 శాశ్వత లింకు | స్పందించండి
  Tags: కడప, కాంగ్రెస్, చిరంజీవి, జండా, జెండా, ఝండా, తొడ, ప్రజారాజ్యం, మీసం, ముఖ్యమంత్రి, ముద్దు పులివెందుల,   

  మీసమా – ముద్దా? 

  ప్రేమే లక్ష్యం - సేవే రాజ్యం

  ప్రేమే లక్ష్యం - సేవే మార్గం

  ప్రేమే లక్ష్యం – సేవే మార్గం గా ప్రజారాజ్యం పార్టి ని స్థాపించిన చిరంజీవి, “తొడగొట్టి, మీసం  మెలేసి” మరీ గద్దేనెక్కుతాడా?

  ఒక ఫాక్షనిస్టుగా మొదలై, రాజకీయవేత్తగా అంచెలంచెలుగా ఎదిగి నేడు ముఖ్యమంత్రి గద్దె నెక్కిన రాజశేఖరుడు,  ముద్దులతో ప్రజలను ముంచెత్తి మురిపించడమా?

  (ఫ్లయింగ్ కిస్ తో మురిపిస్తున్న ముఖ్యమంత్రి)

   
 • మగవాడు 9:08 pm on November 21, 2008 శాశ్వత లింకు | స్పందించండి
  Tags: , జగతి, జగన్, పత్రికలు, ప్రసార మధ్యమాలు, రాక్షసశేఖర్, , రాజీవశేఖర్, రామోజి, రామోజీ, రామోజీ రావు, రావు, సాక్షి, సుమన్   

  జసుగమన్ రామాయణం 

  Your faults as a son is my failure as a father“, మార్కస్ అరీలియస్.

  ఇంగ్లిష్ వాళ్ళకి ఎల్లో జర్నలిజం ఉంది. అపనిందలు, దూషణలు, వాస్తవాలని వక్రీకరించి రాయడం,  అవాస్తవాలను, నమ్మశక్యం కాని విషయాలను ప్రజలు నమ్మేవిధంగా రాసి, ఆ విధంగా పాఠకులను  ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం, అలాంటి కధనాలను ప్రచురించడం ఎల్లో జర్నలిజం లో సహజం.  డబ్బుకోసం ఒకొక్కప్పుడు, సర్కులేషన్ కోసం అలాంటి పద్దతులని ఈ ఎల్లో జర్నల్ స్ పాటిస్తూ ఉంటాయి.  వారికి నలుగురి నోళ్ళలోను తమ పత్రిక పేరు నానుతుంటే, పదిమందిలో గుర్తింపు వస్తుంది కాబట్టి, తమ అమ్మకాలు పెరుగుతవి, ప్రకటనదారులు తమ పత్రికలో ప్రకటనలిస్తారు, ఆదాయం పెరుగుతుందని వారి భావన.  కొండోకచో అది ఫలిస్తుంది కూడా! (More …)

   
  • Madhu Janjur 10:50 సా. on నవంబర్ 21, 2008 శాశ్వత లింకు | స్పందించండి

   What ever you said correct, Butthe winner is only One. And everybody knows who is that person–
   May God give full strength to Ramoji.

   –Madhu

  • అష్టావక్ర 5:38 ఉద. on నవంబర్ 22, 2008 శాశ్వత లింకు | స్పందించండి

   బాగా రాశారండి!!
   refreshing to read something which makes sense!

  • pappu 10:59 ఉద. on నవంబర్ 22, 2008 శాశ్వత లింకు | స్పందించండి

   నేను నిన్న సాయత్రం ఈన్యూస్ సాక్షిలో చదివాను. చాల చక్కగ ప్లాన్ చేసారు..దీన్నిబట్టి చూస్తే ప్రభాకర్ కి వారంటీ అయిపోయినట్లనిపిస్తోంది.ఈ దేవదూత రేషన్ కార్డ్ ని దేవుడి పుత్రులో వారి దూతలో చింపేసి అది ఆ పత్రికాధిపతిమీదకి తోసేసి ఆయన్ని ఎదో రకంగా “గ్లేడిఏటర్”లో లాగ??? అని అనుకున్నాను..
   ఇవ్వాళా పొద్దున్నే న్యూస్ దేవదూత మీద దాడి అని…

  • lalita 12:42 సా. on నవంబర్ 22, 2008 శాశ్వత లింకు | స్పందించండి

   పప్పుగారు చెప్పింది నిజమయ్యే అవకాసం లేకపోలేదు
   ట్విస్ట్ మీద ట్విస్టు

  • alwar swamy 12:59 సా. on నవంబర్ 22, 2008 శాశ్వత లింకు | స్పందించండి

   manasu-nanasakshi- viouvalu ;;these are the words now extinct.
   To peep into others personal rooms and publicising them with our own mirchi masala
   is the order of the day. May God bless them with little humanity.

  • కొత్తపాళీ 9:44 సా. on నవంబర్ 22, 2008 శాశ్వత లింకు | స్పందించండి

   Interesting comparison with Marcus Aurelius.
   అందుకే తెలుగులో ఏదో సామెత ఉంది, పుణ్యం కొద్దీ పురుషుడూ దానం కొద్దీ బిడ్డలూ అని.
   కానీ నాకొకటి విచిత్రంగా అనిపిస్తున్నది. ఎందుకు జనాలందరూ (మీతో సహా) రామోజీ మీద సానుభూతి కురిపించడం? అంటే, సటి మనిషికి ఇలాంటి తలవంపులయ్యే కష్టం వచ్చిందే అనే భావన ఐతే సరే. కానీ కార్పొరేటు కుటుంబాల్లో, రాజకీయ కుటుంబాల్లో ఇటువంటి వెన్నుపోట్లు సాధారణమే కాదా?

  • మగవాడు 11:44 ఉద. on నవంబర్ 24, 2008 శాశ్వత లింకు | స్పందించండి

   @ కొత్తపాళీ: మీ “తుపాకి” కధలో శంకర్ చేసిందేమిటి? ఒక తండ్రిగా కిరణ్‌కి ఏం చెప్పాడు?

   రామోజీ రావు మీద సానుభూతి కనపడిందా మీకు ఈ టపాలో?

   మార్కస్ తన తండ్రి పాత్రలో విఫలం అవ్వలేదా? రాజశేఖరెడ్డి, జగన్‌కి నేర్పిందదేగా?ప్రత్యర్ధిని ఎలా దెబ్బతియ్యాలనడమేగా.

   కాని ఇక్కడ సుమన్ దుర్బలుడు. అహంకారి. అతను స్నేహితుడుగా ఎంచుకున్న వ్యక్తి – ఒక పరాన్నజీవి. కాబట్టే సుమన్ బయట పడ్డాడు. అందులోను “సాక్షి” ద్వారా. ఆ
   “దూత” అనబడేవాడు టీ.వీ ౯లో. ఆ రెండూ, ఆ యా వ్యాపార రంగాలలో రామోజీ రావు సంస్థలకు ప్రత్యర్ధులు.
   ఒకరికి ప్రత్యర్ధిని దెబ్బతీయడం మొదటి కర్తవ్యం ఐతే, రెండో వారికి, వారి రేటింగ్స్!

   కార్పరేట్ వ్యవస్థ – బోర్డ్ రూమ్‌లో ని ఆటలకి దీనికి సంబంధం లేదు. వ్యవహారం కేవలం వ్యక్తిగతం, అంతర్గతం. కాబట్టి ఇక్కడ వెన్నుపోటు ప్రసక్తే లేదు.

   ఎవరూ ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. మీరు మరి అలా ఎందుకనుకున్నారో.

   @ Madhu: “When the going gets tough, the tough gets going.” It is also attributed to Joseph P Kennedy, f/o John F Kennedy the late president of US of A: Here Ramoji is going through some of the toughest hours in the winter of his life. He needs all the support he deserves.

   @ అష్త్రావక్ర: నెనరులు.

   @ పప్పు: ఆ వ్యక్తి (మీరంటున్న దేవదూత) మన కాలాన్ని వృధా చేస్తున్నాడు.అతన్ని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

   @ సుజాత: అంత దూరం వెళ్ళదులేండి.

   @ alwar swamy: Dont you think it is ironic? మారదర్శి ని ప్రసారంచేసే తండ్రి – తన తనయుడికి మార్గదర్శి కాలేకపోవడం!

 • మగవాడు 3:50 pm on November 10, 2008 శాశ్వత లింకు | స్పందించండి
  Tags: , పరిచయం, ముందుమాట, intro   

  మరో మగవాడి బ్లాగు కాదు! 

  మీరు ఇది మరో మగవాడి బ్లాగు అని సులువుగా తీసెయ్యవచ్చు.  కాని అలా తీసేసే బ్లాగు కాదు. ఇది ఒక మగవాడి జీవితం.  ఒక మగవాడికి అవసరమైన అన్ని విషయాలు ఇక్కడ ఉంటాయి.

  డబ్బు ఉంటుంది. దాని చుట్టు చేరిన ఈగల గురించి ఉంటుంది.

  అందం ఉంటుంది.  దానికోసం అర్రులు చాచడం గురించి కధలు కూడ ఉంటాయి.

  వాడి భార్య ఉంటుంది. వాడి మీద ఆమెకున్న ప్రేమ గురించి ఉంటుంది. వాడికి వచ్చిన జ్వరం ఉంటుంది.  ఆమె అతనికి చేసిన సేవ గురించి ఉంటుంది.

  అవిడ మీద వాడి ప్రేమ ఉంటుంది.  వాళ్ళ మధ్య శృంగారం గురించి కూడా ఉంటుంది. (More …)

   
c
Compose new post
j
Next post/Next comment
k
Previous post/Previous comment
r
స్పందించండి
e
మార్చు
o
Show/Hide comments
t
Go to top
l
Go to login
h
Show/Hide help
shift + esc
రద్దుచేయి