మరో మగవాడి బ్లాగు కాదు!

మీరు ఇది మరో మగవాడి బ్లాగు అని సులువుగా తీసెయ్యవచ్చు.  కాని అలా తీసేసే బ్లాగు కాదు. ఇది ఒక మగవాడి జీవితం.  ఒక మగవాడికి అవసరమైన అన్ని విషయాలు ఇక్కడ ఉంటాయి.

డబ్బు ఉంటుంది. దాని చుట్టు చేరిన ఈగల గురించి ఉంటుంది.

అందం ఉంటుంది.  దానికోసం అర్రులు చాచడం గురించి కధలు కూడ ఉంటాయి.

వాడి భార్య ఉంటుంది. వాడి మీద ఆమెకున్న ప్రేమ గురించి ఉంటుంది. వాడికి వచ్చిన జ్వరం ఉంటుంది.  ఆమె అతనికి చేసిన సేవ గురించి ఉంటుంది.

అవిడ మీద వాడి ప్రేమ ఉంటుంది.  వాళ్ళ మధ్య శృంగారం గురించి కూడా ఉంటుంది.

వాడి పిల్లల గురించి, వాళ్ళ చదువులు, వాళ్ళ జీవితం గురించి ఉంటుంది.

వాడి బాస్ గురించి ఉంటుంది. వాడి స్నేహితురాళ్ళ గురించి ఉంటుంది.

కులాలుంటాయి. దేవుడుంటాడు. మతాలుంటాయి. వరాలకి అడ్డం పడ్డ పుజారి కూడా ఉంటాడు.

వాడి కలలు, కన్నీళ్ళు, వాటి వెనకున్న వెతలు కూడ ఉంటాయి.

వాడికి నచ్చిన సాహిత్యం ఉంటుంది, వాడికి నచ్చిన సినిమాలుంటాయి, వాడికి నచ్చిన హీరోయిన్లుంటారు. వాడికి నచ్చిన సంగీతం ఉంటుంది.

వాడికి నచ్చని రాజకీయవేత్తలుంటారు.  నచ్చిన వాళ్ళూ ఉంటారు.  మెచ్చని రాజకీయాలు ఉంటాయి.

వాడికున్న సమస్యలు, వాడికున్న సందేహాలు, వాడికి తోచిన పరిష్కారాలు ఉంటాయి.

ఇది పూర్తిగా, ఒక మగవాడి బ్లాగు.

ప్రకటనలు