జసుగమన్ రామాయణం

Your faults as a son is my failure as a father“, మార్కస్ అరీలియస్.

ఇంగ్లిష్ వాళ్ళకి ఎల్లో జర్నలిజం ఉంది. అపనిందలు, దూషణలు, వాస్తవాలని వక్రీకరించి రాయడం,  అవాస్తవాలను, నమ్మశక్యం కాని విషయాలను ప్రజలు నమ్మేవిధంగా రాసి, ఆ విధంగా పాఠకులను  ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం, అలాంటి కధనాలను ప్రచురించడం ఎల్లో జర్నలిజం లో సహజం.  డబ్బుకోసం ఒకొక్కప్పుడు, సర్కులేషన్ కోసం అలాంటి పద్దతులని ఈ ఎల్లో జర్నల్ స్ పాటిస్తూ ఉంటాయి.  వారికి నలుగురి నోళ్ళలోను తమ పత్రిక పేరు నానుతుంటే, పదిమందిలో గుర్తింపు వస్తుంది కాబట్టి, తమ అమ్మకాలు పెరుగుతవి, ప్రకటనదారులు తమ పత్రికలో ప్రకటనలిస్తారు, ఆదాయం పెరుగుతుందని వారి భావన.  కొండోకచో అది ఫలిస్తుంది కూడా!

♦  ♦  ♦

జగన్మోహన రెడ్డి పత్రిక నేమ్‌ప్లేట్ (nameplate) పసుపచ్చ రంగులో ఉంటుంది.  దానిలో సాక్షి అక్షరాలు ముదురు నీలం రంగులొ ఉంటాయి. కొంచెం దూరం నుంచి చూసిన వారికి ఆ అక్షరాలు నల్ల రంగులో కనపడ్డంలో  ఆశ్చర్యం ఉండదు.  హిందూవులకి పసుపు మంగళప్రదం. నలుపు రంగు – విషాదాన్ని, దుఖాన్నీ సూచిస్తుంది.

♦  ♦  ♦

ఈనాడు పత్రిక సంపాదకుడు ఎవరు?

సాక్షి పత్రిక సంపాదకుడు ఎవరు?

ఆంధ్రజ్యోతి సంపాదకుడు ఎవరు?

♦  ♦  ♦

ఈనాడు పత్రిక అధినేత ఎవరు?

సాక్షి పత్రిక అధినేత ఎవరు?

ఆంధ్రజ్యోతి పత్రిక అధినేత ఎవరు?

మీ జవాబులతోనే మీకు తెలిసిపోయి ఉంటుంది, మీ బుర్రలోకి సంపాదకుడి పేరు ముందు వచ్చిందా, లేదు ఆ పత్రికాధినేత పేరు ముందు వచ్చిందా అని.

వ్యాపారాలు లాభాలకొరకే!  కాబట్టి సంపాదకులతో కాని వారి విలువలను ప్రవచించే సంపాదకీయాలు గాని పాఠకులకు అఖ్ఖర్లేదు. తన పత్రికలో ఏది ఉండాలి, ఏది ఉండకూడదన్నది యాజమాన్యాలు నిర్ణయిస్తాయి.   వార్తా  ప్రసారరంగంలో సాంకేతిక విప్లవం పాఠకులకు కావలిసిన సమాచారాన్ని సెల్‌ఫోను ద్వారా, టెలివిజన్ ద్వార, జాలం ద్వారా ఇంకా అనేక రకాలుగా అందుబాటులో ఉంచుతున్నది.   నేటి పాఠకులు తనకు కావల్సిన వార్తని తనకు అనువైన విధంగా తన సమయానుకూలంగా, తను కోరుకున్న పద్ధతిలో అందుకోగలుగుతున్నారు.

జగన్ మోహన్ రెడ్డి కి  ఆయన తండ్రి ప్రస్తుతం ఆంధ్రదేశ ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి నేర్పిన పాఠాలు, జగతి పబ్లికేషన్స్ – సాక్షి చూపిస్తున్నది.

లాభాపేక్ష.

ఈ పోటి ప్రపంచంలో గెలుపు ముఖ్యం – దానిని ఎలా సాధంచామన్నది ముఖ్యం కాదు. యుద్ధంలో “Do not hit under the belt” (పొట్ట కింద కొట్టరాదు.) అని అంటారు.  కాని నేటి ప్రపంచంలో అది పనికి రాదు.  వాడు నిన్ను కొడితే, నువ్వు కొట్టు.  వీలైతే ఇంకా గట్టిగా కొట్టు.  తొడగొట్టి, మీసం మెలేసి మరి, పొట్టకింద కొట్టి, వాడు మళ్ళీ లేవకుండా చావగొట్టు. శత్రుశేషం ఉంచకూడదు. అవతలి వాడు మొద్దువాడని ఉపేక్షించకూడదు. వాడిని కూడా హతమార్చాలి. లేకపోతే తన ఉనికికే భంగం ఏర్పడవచ్చు.

సాక్షి ప్రచురించకపోతే మరొక పక్షి ప్రచురిస్తుంది.  అది అవతలి వాడికి లాభం చేకూర్చుతుంది.  అదేదో మనమే ప్రచురించిద్దాం అని సాక్షి అనుకోవడంలో తప్పేమీ లేదు.

నేను ఈ టీవీ వాడిని.  మా నాన్న కి విరోధులు ఆ టీ.వీ 9 వాళ్ళూ, వాళ్ళే నా ఇంటికి వస్తారు నా ఇంటర్వ్యూ కోసం.  అలా నా పగ తీర్చుకుంటాను, అని ఆరు నెలల క్రిందటే సుమన్ రెడి అయ్యాడు.  శ్రేయోభిలాషులు ఆపారు.  నేడు టి వి 9 పోయింది.  సాక్షి వచ్చింది.

తెలుగు మీడియాలో, సుమనంత గొప్ప  మెగలోమనీయాక్ఉంటాడని అనుకోను.  ప్రభాకర్ కంటే గొప్ప సైకోఫాంట్ ఉంటే ఉండవచ్చు గాక.

రామోజి రావు కి కష్టకాలం.  తప్పదు. భరిస్తాడు.  అన్ని అపజయాలు ఎదుర్కొన్నా, ఇన్ని గెలుపులు అతనే సాధించగలిగాడు.  ఆ గెలుపులోనే సేద తీరుతాడు.

♦  ♦  ♦

ఐదు ఆస్కార్లు గెలుచుకున్న “గ్లాడియేటర్” సినిమాలో మార్కస్ అరీలియస్ తన కొడుకు కామడస్ తో అంటాడు: “Your faults as a son is my failure as a father.” తన తండ్రి తనకు పట్టం కట్టడు అని తెలుసుకున్నప్పడు మహారాజు మార్కస్ మీద ప్రేమని ఒలకబోస్తూ, నమ్మించి, ఆ ముదుసలిని తన చేతుల్లోకి తీసుకుని, మెడ పిసికి, గొంతు నులిమి, ఊపిరి ఆపేసి చంపేస్తాడు ఆ తనయుడు కామడస్.

♦  ♦  ♦

మార్కస్ మాటలు తండ్రులందరికి వర్తిస్తాయి.

Russel Crowe as & in Gladiator

Russel Crowe as & in Gladiator

Joaquin Phoenix as Commodus killing his father Marcus (Richard Harris)

Joaquin Phoenix as Commodus killing his father Marcus (Richard Harris)* నేటి సాక్షిలో రామోజి రామాయణం చదివిన తరువాత

Loading imageClick anywhere to cancel

Image unavailable

Loading image

Click anywhere to cancel

Image unavailable

Loading image

Click anywhere to cancel

Image unavailable

Loading image

Click anywhere to cancel

Image unavailable

Loading image

Click anywhere to cancel

Image unavailable

Loading image

Click anywhere to cancel

Image unavailable

Loading image

Click anywhere to cancel

Image unavailable

Loading image

Click anywhere to cancel

Image unavailable

ప్రకటనలు