మరో ఇద్దరు కలిసారు

వారే శ్రీనివాస్ పప్పు, అష్టవక్ర.

నేపధ్యం:  ముంబై ఘాతుకాల నేపధ్యంలో నా మొదటి టపా.

ప్రస్థుత వ్యవస్థ, రాజకీయ ప్రక్షాళనం చెయ్యాలన్న సూచన.  వస్తున్న ఎన్నికల ఫలితాలను కొంతైనా ప్రభావితం / మార్చడానికి చెయ్యగలిగిన ఒక కార్యాచరణ ప్రణాళిక కొరకు ఒక పిలుపు.

ఈ నేపధ్యంలో, చీకటిని తిట్టుకుంటూ కూర్చోకుండా, కార్యోన్ముఖలవ్వడానికి కొంత ప్రేరణ కలిగించే టపాలు ఇందాక చెప్పుకున్నట్టుగా,  రెండు వెలువడ్డవి.

చదువరి గారు తమ పద్ధతిలో చెప్పదలుచుకున్నది చెబుతున్నారు.  వారు లోక్‌సత్తా పార్టీ కి తమ మద్దతు తెలుపుతున్నారు.  సహాయాన్ని అహ్వానిస్తున్నారు కూడా!

కాని వారి టపాలో వాఖ్యలు చదివినా, వాడిని, వీడిని తిట్టడమే కనబడుతుంది కాని ఆచరణయోగ్యమైన పధకాలు కనపడడం లేదు. మరి ఉంటే నేను గమనించలేదో!

అక్కడే డా.ఇస్మాయిల్ గారు ఒక సూచన చేసారు. చదవండి.  మీ స్పందనని అక్కడే  తెలియజేయండి.

Chief Election Commissioner గోపాలస్వామి గారు ౨౦౦౯ ఏప్రిల్, మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నవని అన్నారు.  కాబట్టి కొంత సమయం ఉంది.  ఐనా మనం చెయ్యవలసింది చాలానే ఉంది.

మీ ఆలోచనలేవైనా ఉంటే ఇక్కడ మీ వ్యాఖ్యలలో వెలిబుచ్చండి.  లేదు మీ బ్లాగులోనే టపాయించండి.

నాకు తెలియజేస్తే ఇక్కడ ఒక లంకె వేస్తాను.  లేదు, మీ టపాలో దీనికి ఒక లంకె ఇచ్చినా సరే!

ఈలాంటి టపాలు మీకు తెలిసినవి ఉన్నా, మీరే రాసినా దయచేసి నాకు తెలియజేయండి. సాధ్యమైనంత వరకు వాటికి ఇక్కడ లంకెలివ్వడానికి ప్రయత్నిస్తాను.

ప్రకటనలు