ఏం చెయ్యాలి?

అప్పటికే డవున్ సైజింగ్ ఐపోయ్యింది.  టాప్ హేవి గా ఉన్నదని, నన్ను సెలవు పుచ్చుకోమన్నారు.  వాళ్ళు ఆ మాట అన్న తరువాత చెయ్యగలిగినది ఏమున్నది, తప్పుకోక.  సమయం లేదు.  వయస్సు తక్కువ కాదు.  అనుభవమూ తక్కువ కాదు. కాని నాకు తగిన ఉద్యోగం దొరకాలి కదా!  దొరికినా, వాళ్ళు ఇవ్వాలి కదా?

అబ్బే సేవింగ్స్    అవి ఏమి లేవు.  ఇన్ ఫాక్ట్ ఉన్నవన్ని దులిపెయ్యడం కూడా ఐపొయ్యింది.  మరి నా ఖర్చులు ఎలాగా?

మా వాడు ఉద్యోగంలొనే ఉన్నాడు.  పెద్ద ఉద్యోగం ఏమి కాదు కాని, వాడిది ‘నిష్’ ఏరియా.  పైగా వాడిని ట్రైనింగ్ కింద తీసుకున్నారు.  ఆ జీతాన్ని నమ్ముకుని ఒక బైక్ కొనుక్కున్నాడు. మంచి స్టాండ్ అలోన్ ఒకటి.  ఆ మానిటర్ ఒక్కటే పదిహేనో, ఇరవయ్యో!  దానికి ప్రతి నెల ఈ.ఎం.ఐ లు కట్టుకుంటున్నాడు.

ఇక వాడి చెల్లెలి చదువుకని నాకు బాంకు వాళ్ళు ఒక లక్ష అప్పు ఇచ్చారు.  నెలకి ఒక ఐదు వేల దాకా అది కట్టుకోవాలి. అది కాక ఇక మందులు, మాకులు. ఎంత లేదన్నా నెలకి ఒక 7/8 వేలు కావాలి.

ఉన్నవి దులిపేస్తే జేబులో ఒక వంద కాగితం మిగిలింది. పోయిన నెల అద్దె ఇంకా కట్టలేదు.   ఇంకా నెల పూర్తి కాలేదు. టెలిఫోన్ బిల్లు, మందులు ఐపోయినవి.  వాటికి ఖర్చులు.  వాడి జీతం నెలాఖరుకి కాని రాదు. అలసటతో మంచం మీద పడుకుని ఉన్నాడు.  నీ దగ్గిరేమైనా ఉన్నవా అని అడిగాడు. ఏవి లేవురా అని అన్నాను.  కళ్ళు మూసుకున్నాడు.  ఆ వంద కాగితం జేబులో వేసుకుని ఎవరినన్నా చేబదులు అడుగుదామని బయలుదేరాను.  దారిలో వచ్చింది ఆలోచన.  వాడు మొన్న రాత్రి నుంచి ఏమి తినలేదని.  ఇందాక వాడు కళ్ళు మూసుకుంది, తన కన్నిరుని నాకు కనపడకుండా  దాచుకున్నాడని.

ఏం చెయ్యాలి?

ప్రకటనలు