యవ్వనాన్ని స్ఖలించాను

నా కొక జ్ఞాపకాన్ని పాడవా

అంటూ ఆ కళ్ళలోని నిశబ్దం నన్ను అడిగింది.

చీకటిని పరుస్తున్న వెన్నెల

చిగురాకుల రెపరెపల మధ్య కిసుక్కున నవ్వింది.

లాగిన నరాలను మీటిన వలపుల తలపుల

హొరు ఒక తుఫానుని రేపింది.

ఆ నరాల అలజడి

ఒక ప్రేమని స్ఖలించింది

ప్రకటనలు