జసుగమన్ రామాయణం 

Your faults as a son is my failure as a father“, మార్కస్ అరీలియస్.

ఇంగ్లిష్ వాళ్ళకి ఎల్లో జర్నలిజం ఉంది. అపనిందలు, దూషణలు, వాస్తవాలని వక్రీకరించి రాయడం,  అవాస్తవాలను, నమ్మశక్యం కాని విషయాలను ప్రజలు నమ్మేవిధంగా రాసి, ఆ విధంగా పాఠకులను  ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం, అలాంటి కధనాలను ప్రచురించడం ఎల్లో జర్నలిజం లో సహజం.  డబ్బుకోసం ఒకొక్కప్పుడు, సర్కులేషన్ కోసం అలాంటి పద్దతులని ఈ ఎల్లో జర్నల్ స్ పాటిస్తూ ఉంటాయి.  వారికి నలుగురి నోళ్ళలోను తమ పత్రిక పేరు నానుతుంటే, పదిమందిలో గుర్తింపు వస్తుంది కాబట్టి, తమ అమ్మకాలు పెరుగుతవి, ప్రకటనదారులు తమ పత్రికలో ప్రకటనలిస్తారు, ఆదాయం పెరుగుతుందని వారి భావన.  కొండోకచో అది ఫలిస్తుంది కూడా! (More …)